అమరావతి ఐకాస రేపు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. రాజధాని రైతుల ఉద్యమం 600 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి ఐకాస రేపు తలపెట్టారు. అదే సమయంలో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ర్యాలీకి సిద్ధమయ్యారు. కాగా కొవిడ్ దృష్ట్యా ర్యాలికి అనుమతి సాధ్యం కాదని డీఐజీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అనుమతులు సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. 50 మంది కంటే…