Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు.