అమెరికాలో మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓ భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా సయ్యద్ 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.
5 Indian-Americans In Race For US Congress's Midterm Elections: అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారం కోల్పోయిన రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. నవంబర్ 8న యూఎస్ఏలో ఈ మధ్యంతర ఎన్నిలకలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ-అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఐదుగురు పక్కాగా గెలుస్తారని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.