ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇమాన్యుయేల్ మక్రాన్ ‘‘ముద్దు’’ వివాదంలో ఇరుక్కున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ క్రీడా మంత్రి అమేలీ ఓడియా-కాస్టెరాని ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. అధ్యక్షుడు మక్రాన్ మెడపై చేయి వేసి కిస్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారానికి దారి తీసింది.