కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇప్పుడు అంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. అయితే, ఇంకా కొందరిలో అపోహలు ఉన్నాయి.. వారి అపోహలు వీడి వ్యాక్సిన్ కోసం అడుగులు వేసేలే.. పలు సంస్థలు రకరకాల స్కీమ్‌లను ప్రవేశ పెడుతున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అమ్‌వాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) కొత్తగా ఓ ఆఫర్ తీసుకొచ్చింది… వ్యాక్సినేషన్‌కు, పండుగకు లింక్ చేసి.. మరీ ఆఫర్ ప్రకటించింది ఏఎంసీ.. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుంటే లీటర్ వంట నూనె ప్యాకెట్ ఉచితంగా…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద సంఖ్యలే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారికి ప్రధాన్యత ఇస్తున్నారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతున్నది. 17 లక్షల మంది జనాభా కలిగిన నగరంలో కేవలం ఇప్పటి వరకు 3.08 లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. అంటే జనాభాలో 20శాతం…