సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో నేటి నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఈనేపథ్యంలో.. స్థానికులు ప్రజలు తమ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
హైదారబాద్ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే.. అంబర్పేట లోని పటేల్ నగర్ లో 8వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే జయంతి చారి అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించినందుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్పేట పోలీస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. బాలిక నివాసం పక్కనే ఇంట్లో ఓయూలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నటువంటి జయంత్ చారి బాలికను బుక్స్ ఇస్తానని ఇంట్లో పిలుచుకొని…
హైదరాబాద్ అంబర్ పేట్ లోని పాత పుస్తకాల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది… సుమారు ఒంటి గంట ప్రాంతంలో షాపులో మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు… సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసారు… పుస్తకాలు షాపు కావడంతో మంటలను అదుపుచేయటం ఫైర్ సిబ్బందికి కష్టతరం అయింది.. దీపావళి టపాసుల వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. అటు హైదరాబాద్‌లో దీపావళి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ఛత్రినాక పోలీస్…
ఎన్నికల వరకు కలిసే ఉన్నారు. అన్నొస్తున్నాడంటే సందడి చేశారు. కానీ.. పార్టీ కమిటీల ప్రకటన వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చేసింది. కత్తులు నూరుతున్నారట. గల్లీ గల్లీ గరంగరంగా మారినట్టు అధికారపార్టీ వర్గాల టాక్. ఇంతకీ ఏంటా పంచాయితీ? ఎమ్మెల్యే కాలేరుపై కార్పొరేటర్లు, సొంత పార్టీ నేతల గుర్రు..! కాలేరు వెంకటేష్. హైదరాబాద్ సిటీలో అంబర్‌పేట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని GHMC కార్పొరేటర్లు, మాజీలు కాలేరు పేరు చెబితేనే ఒంటికాలిపై లేస్తున్నారట. నిన్న మొన్నటి వరకు తమ డివిజన్‌కు…
గత మూడు రోజులుగా భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షాలకు రోడ్లు నీటమునిగాయి. ఇక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఇక గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గండిపేటకు పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మూసీ పరివాహ ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్‌పేట్- మూసారాంబాగ్ వంతెన…