ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ పేరుతో పథకాన్ని అమలు చేశామని.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్…
గత నెల 24న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులను.. వారు చేసే విధ్వంసాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఈ సందర్భంగా కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తీరు చర్చకు వచ్చింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 72 రోజుల తర్వాత ఆయన్ని…
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నుండి ఈ నెల 10తేదీ వరకు అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసనగా కార్యక్రమాలు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తో రాజ్యాంగంపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. పాలకులు తమ వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి…