Rahul Gandhi: అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌కి చెందిన ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, ఎడిటెడ్ వీడియోను ప్రచారం చేస్తోందని, నిజానికి అంబేద్కర్‌ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఎదురుదాడికి దిగింది.