నారా బ్రాహ్మణి పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం ఏంటనేది కూడా చూడాలని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావటం దురదృష్టకరమని విమర్శించారు. ఇది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు.
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యామ్ బాబు అనే పాత్రను తీసుకొచ్చారని, కావాలనే ఆ పాత్రను తనను అగౌరపర్చడానికే సృష్టించారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.