Special Focus on Amazon: అగ్రరాజ్యం అమెరికాలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అమేజాన్‌కి మన దేశంలో బిజినెస్ పైన పెద్ద ఆశలే ఉండేవి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి కావటమే దీనికి కారణం. అందుకే ఇక్కడ గత పదేళ్లలో ఆరున్నర బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవాలని ఆశించింది. కానీ.. ఇటీవలి పరిణామాలను బట్టి చూస్తుంటే అమేజాన్ కలలు కల్లలవుతున్నాయా?