Special Story on Amazon’s Logistics Business: అమేజాన్ బ్రాండ్ లోగోలో.. A టు Zను తెలియజేస్తూ బాణం గుర్తుంటుంది. అది ఆ కంపెనీ డెలివరీ చేసే ప్రొడక్టుల రేంజ్‌కి అద్దం పడుతోంది. అంటే.. అమేజాన్ అందించని సేవలంటూ ఏమీ లేవని కూడా పరోక్షంగా అర్థంచేసుకోవచ్చు. ఇ-కామర్స్ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగిన అమేజాన్.. ఇటీవల ఇండియాలో ‘అమేజాన్ ఎయిర్’ అనే సరికొత్త సర్వీసును లాంఛ్ చేసింది. దీంతో.. విమానాల ద్వారా కూడా ఉత్పత్తుల చేరవేతను ప్రారంభించింది.