కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధాని వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందని వ్యాఖ్యానించారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని తెలిపారు.