MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని ఈ నెల 9న అమరావతికి రానున్నారు. ప్రపంచ క్రికెట్‌లో ‘కూల్ కెప్టెన్’గా గుర్తింపు పొందిన ధోని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి, యువ ప్రతిభను వెలికితీయడానికి రాష్ట్రంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు అంశంపై చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. కిడ్నీలో స్టోన్స్ వద్దు అంటే…