ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. అన్ని పార్టీలకు చెందినవారికి సముచిత స్థానం కల్పిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నారు.. ఇవాళ 22 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ మరో లిస్ట్ విడుదల చేశారు..
ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు. మహిళలు, రైతులు 800రోజులకు పైగా ఉద్యమం చేశారు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని.. మళ్లీ వివాదం…
ఏపీలో ఉద్యోగ సంఘాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీఆర్సీ పీటముడి వీడక పోవడంతో ఏంచేయాలో తెలీని పరిస్థితి ఏర్పడింది. వేర్వేరుగా సమావేశం అయిన ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణపై మల్లగుల్లాలు పడుతున్నారు. వేర్వేరు సమావేశాల అనంతరం సంయుక్తంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై కసరత్తు చేయనున్నాయి రెండు జేఏసీలు. గత నెలలో ఎక్కడ ఉద్యమాన్ని వాయిదా వేశారో అక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభించనున్నాయి ఉద్యోగ సంఘాలు. నిరసన కార్యక్రమాలు వెంటనే…
ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమయిన అన్యాయం జరగకుండా చూస్తామని, పీఆర్సీ విషయంలో కాస్త ఓపికతో వుండాలన్నారు రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులతో చర్చలు జరిపామన్నారు మంత్రి బొత్స. ఐ.ఆర్. సైతం ప్రకటించామని తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఈ…