SLBC Meeting: : రాష్ట్రంలో ప్రజలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా ప్రజలు నేరుగా బ్యాంకులను ఆశ్రయించే పరిస్థితి రావాలని, అందుకు బ్యాంకర్లు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో వివిధ రంగాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలపై…
CM Chandrababu: రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల సహకారం, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొత్త ఏడాదిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, అనుబంధ రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈల…