ఏపీ ప్రభుత్వం 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయగా…. ప్రజాభిప్రాయ సేకరణలో చుక్కెదురైంది. బుధవారం నాడు తుళ్లూరు మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సందర్భంగా 16 గ్రామాలు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇప్పటికే ఈ విషయంపై పలుచోట్ల అధికారులు గ్రామ సభలు నిర్వహించగా ఈరోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014లో సీఆర్‌డీఏ చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్‌కు తాము అనుకూలమని…
ఏపీలో అమరావతి ఎప్పడూ హాట్ టాపిక్కే. తాజాగా అమరావతిని కార్పోరేషన్ గా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా రాజధాని గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. అమరావతి కాపిటల్ సిటీ ప్రభుత్వ ప్రతిపాదనకు రైతులు, గ్రామాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కురగల్లు, మందడం, నీరు కొండ ప్రాంతాల్లో రాజధాని గ్రామాలను విలీనం చేస్తున్నామని అధికారులు ప్రతిపాదన పెట్టారు. సీఆర్‌డీఏ…చట్టాల ప్రకారం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని…కార్పొరేషన్ సిటీకి వ్యతిరేమంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.…