కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్,…
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు జోడించడంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇది అమలాపురంలో విధ్వంసానికి దారి తీసింది.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టేవరకు వెళ్లింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వైసీపీకి అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా..? అని ప్రశ్నించారు. అంబేద్కర్ దేశానికి దైవం.. కోనసీమలో హింసను ఖండిస్తున్నామన్న ఆయన.. కోనసీమ ఆందోళనల్లో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనలేదన్నారు. అంబేద్కర్ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి…