తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన జలాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, అవసరం అయితే ఏ రాష్ట్రంతోనైనా పోరాడతామని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Jurala Project: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 82,398 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో నిల్‌గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.