అల్లు అర్జున్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్ గూడ జైలులోని రిసెప్షన్ లోనే ఉన్నారు. కానీ, బెయిల్ పత్రాలు ఆలస్యం రావడంతో ఆయనను మంజీర బ్యారక్ లో ఉంచారు. ఈ సందర్భంగా జైలు అధికారులు అండర్ ట్రైల్ ఖైదీగా 7697 అనే నెంబర్ ను కేటాయించారు.
బెయిల్ ఆర్డర్ కాపీ అందిన తర్వాత జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేశాయని చెప్పుకొచ్చారు. అయితే, వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ లో స్పష్టంగా ఉన్నప్పటికి.. కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని అడ్వకేట్ అశోక్ రెడ్డి వెల్లడించారు.