అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయంతో దేశీయ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. బుధవారం అగ్ర రాజ్యం ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్లారు.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు సరికొత్త జోష్ తీసుకొచ్చింది. ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి.
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా కొనుగోళ్లు కనిపించాయి.
మొత్తానికి భారీ నష్టాల్లోంచి దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు యధావిధిగా కొనసాగాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.