అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్.
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 107 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు.
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతుంది. అందులో భాగంగా ఇంగ్లండ్కు టీమిండియా గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ టార్గెట్ 192 పరుగులు చేయాల్సి ఉంది. కాగా.. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బ తీశారు. భారత్ బౌలింగ్ లో అశ్విన్ 5 వికెట్లు తీసి చెలరేగాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4,…