గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని కలిసిపోయామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన-టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీపడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
తెనాలి అసెంబ్లీ స్థానంపై ఆసక్తికర కామెంట్లు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, తాను మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆలపాటి.. ఒక సీటు అని రాసి పెట్టలేదని.. తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన…
ఏపీలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ క్రాప్ నమోదు పేరుతో జగన్ సర్కారు రైతులను దారుణంగా దోచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది రైతులను దోచుకుంటున్న ప్రభుత్వం అని.. అన్నదాతల ఆగ్రహానికి సీఎం జగన్ బలికాక తప్పదని ఆలపాటి రాజా హెచ్చరించారు. భూమి, పంటల వివరాలు సక్రమంగా నమోదు చేయకుండా ధాన్యం కొనుగోళ్లలో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 శాతం భూమికి…
రమ్య మరణం పట్ల సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఇంతటి అరాచకం నా రాజకీయం లో చూడలేదు అని మాజీ మంత్రి ఆలపాటి రాజ అన్నారు. ఒక విద్యార్థిని హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ పై కేసులా… పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కేసులు పెట్టిన తీరు కేసుల్లో చెప్పిన సమయానికి పొంతన లేదు. పోలీస్ అధికారులు నిస్పక్ష పాతం గా వ్యవహరించాలి. పోలీస్ లు రక్షకులు గా కాదు భక్షకులు గా మారి పోయారా…