అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ,…
వైశాఖ శుక్ల పక్షంలోని మూడవ రోజును అక్షయ తృతీయ అంటారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు వారి వారి రాశిచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉంటారు. కాబట్టి సూర్య చంద్రుల ఆశీర్వాదాల ఫలం శాశ్వతంగా ఉంటుంది. అక్షయ అంటే క్షయం కానిది అని అర్థం. ఈ రోజు చేసిన పని, ధాన ధర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులను కొనుగోలు చేసి, చాలా వస్తువులను దానం చేస్తారు. ముఖ్యంగా బంగారాన్ని కొని ఇంటికి…