CITU Workers Protest Outside Minister Konda Surekha’s House: హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ మంత్రి ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవన సాగిస్తున్న వారికి నష్టం చేసే తీరును విరమించుకోకపోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ…
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయం, గోశాలకు సీఎం జగన్ శుక్రవారం నాడు భూమిపూజ చేశారు. రూ.70 కోట్లతో శ్రీకృష్ణ ఆలయం, యువత కోసం యోగా ధ్యాన కేంద్రాలను ఇస్కాన్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన భూమిని కేటాయించింది. అనంతరం రూ.20 కోట్లతో ఇస్కాన్ అక్షయపాత్ర ఏర్పాటు చేసిన ఆధునిక కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ భోజనాన్ని అందించనుంది.…