తెలుగులో మెగా vs నందమూరి ఫ్యాన్ వార్స్, మహేశ్ బాబు vs అల్లు అర్జున్ ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అనేలా తమిళ సూపర్ స్టార్ అజిత్, విజయ్ ల ఫ్యాన్ వార్స్ ఉంటాయి. మా హీరో గోప్ప్ అంటే కాదు మా హీరోనే గొప్ప అనుకునే దగ్గర నుంచి ఫ్యామిలీలని లాగుతూ తిట్టుకునే వరకూ, అవకాశం ఉంటే కొట్టుకునే వరకూ ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్…
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కి మెగా నందమూరి హీరోల మధ్య వార్ జరుగుతుంటే, కోలీవుడ్ లో అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. విజయ్ నటిస్తున్న ‘వారిసు’, అజిత్ నటిస్తున్న ‘తునివు’ సినిమాలు పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. మాములుగానే అజిత్ ఫాన్స్ కి విజయ్ ఫాన్స్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత రైవల్రీ ఉంది. ఈ హీరోల అభిమానులు ఒకరినొకరు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో కూడా గొడవపడుతూ…