అజయ్ దేవగన్‌ను బాలీవుడ్‌లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో…