Ajay Banga: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల మధ్య ‘‘ప్రపంచ బ్యాంక్’’ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పాకిస్తాన్, పీఓకేలలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఆయన మోడీని కలిశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది.