అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని తానూ కోరుకుంటున్నానని సినీనటి రేణు దేశాయ్ అన్నారు. ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడ చూడలేదని ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్లు సరిపోలేదని సంతోషం వెలిబుచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్…