Aishwarya Addala: వివాహేతర సంబంధాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పెళ్లి చేసుకున్నాకా వేరేవారితో ఎఫైర్ పెట్టుకొని కట్టుకున్నవారిని మోసం చేస్తున్నారు. చివరికి కట్టుకున్నవారికి తెలిసేసరికి .. వారిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటున్నారు. ఇలాంటి దారుణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితేఇలాంటి ఎఫైర్లకు సెలబ్రిటీలు కూడా అతీతులు కారు.
ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ మీడియాను ఆశ్రయించారు. పెళ్లయిన తర్వాత ఐశ్వర్య 25 లక్షలు కాజేసి.. విడాకులు ఇవ్వాలని తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్, అడ్డాల…