Bomb Threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరోసారి బాంబు బెదిరింపుల కలకలం కుదిపేసింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబు హెచ్చరిక రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవైట్ నుంచి బయలుదేరి శంషాబాద్ చేరుకోవాల్సిన KU-373 విమానానికి బెదిరింపు రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఫ్లైట్‌ను మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.