Komatireddy Venkat Reddy : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు…
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు తీసుకుంటుందని డీజీపీకి ఎయిర్ పోర్టు అథారిటీ లేఖ రాసింది. జూలై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది.
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో 13 ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. కేంద్రం అమ్మేయాలని భావిస్తున్న 13 ఎయిర్‌పోర్టుల్లో 6 పెద్దవి, 7 చిన్నవి ఉన్నాయి. పెద్ద విమానాశ్రయాల జాబితాలో అమృత్ సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్‌పూర్, తిరుచ్చి, వారణాసి ఉన్నాయి. చిన్న ఎయిర్‌పోర్టుల జాబితాలో సేలం (తమిళనాడు), జలగాం (ఛత్తీస్‌గఢ్),…