ATF Prices Reduced: విమానయాన సంస్థలకు పెద్ద ఊరటనిస్తూ టర్బైన్ ఇంధనం (ATF) ధరను తగ్గించాలని ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.
విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.