చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఐరోపా దేశమైన పోర్చుగల్‌లో జరిగిన ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం ఢీకొనగా.. ఓ పైలట్ మృతి చెందారు. మరో విమానంలోని పైలట్ గాయపడ్డారు.
IT, Engineering Recruitment: ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులకు సువర్ణావకాశం. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో బెంగళూరులో మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఏరో ఇండియా-2023 ఎయిర్‌షో సందర్భంగా ఈ నియామక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఆశావహులు ఆ సంస్థ అధికారులను కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
Two planes crash : అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్ ఎయిర్ షోలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. ఈ ఎయిర్ షోలో రెండు సైనిక విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.
ఐసీసీ మహిళా వరల్డ్ కప్‌లో నేడు భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. కాసేపట్లో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2022లో నేడు ఢిల్లీ-ముంబై జట్ల మధ్య నేడు మ్యాచ్ జరుగనుంది. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగుళూరు జట్లకు మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో 3 సీట్లు…
హైదరాబాద్ నగరంలో అందరూ ఎదురుచూస్తున్న ఎయిర్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు…
శ్రీనగర్‌లో తొలిసారిగా ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26 వ తేదీన శ్రీనగర్‌లో ఎయిర్‌షోను నిర్వహించనున్నారు. ఫ్రీఢమ్ ఫెస్టివల్ పేరుతో ఈ ఎయిర్‌షోను నిర్వహించనున్నారు. ఈ ఎయిర్‌షోకు మిగ్ 21, సుఖోయ్ 30 విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదం కారణంగా నిత్యం తుపాకుల మొతతో దద్దరిల్లిపోయే శ్రీనగర్, దాల్ సరస్సులు ఇప్పుడు కొత్త తేజస్సును నింపుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశ్మీర్‌లోని యువతను ఎయిర్‌ఫోర్స్, విమానయానరంగం…