Air New Zealand: ఎయిర్ న్యూజీలాండ్ విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. దాదాపుగా 16 గంటలు ప్రయాణించిన తర్వాత ఎక్కిన చోటే మళ్లీ దిగాల్సిన పరిస్థితి వచ్చింది. న్యూజీలాండ్ ఆక్లాండ్ నుంచి బయలుదేరిని ఎయిర్ న్యూజీలాండ్ విమానం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణం ప్రారంభించిన విమానం ఫిబ్రవరి 16న సాయంత్రం 5.40 గంటలకు న్యూయార్క్ లోని జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది.