Air New Zealand: ఎయిర్ న్యూజీలాండ్ విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. దాదాపుగా 16 గంటలు ప్రయాణించిన తర్వాత ఎక్కిన చోటే మళ్లీ దిగాల్సిన పరిస్థితి వచ్చింది. న్యూజీలాండ్ ఆక్లాండ్ నుంచి బయలుదేరిని ఎయిర్ న్యూజీలాండ్ విమానం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణం ప్రారంభించిన విమానం ఫిబ్రవరి 16న సాయంత్రం 5.40 గంటలకు న్యూయార్క్ లోని జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 వద్ద విద్యుత్ ప్రమాదం ఏర్పడింది. దీంతో ల్యాండింగ్ చేసేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేసి మళ్లీ ఆక్లాండ్ కు తిరిగి ప్రయాణం అయింది.
Read Also: Fake Degree: ఫేక్ డిగ్రీతో 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం.. గెజిటెడ్ హోదా.. శిక్ష విధించిన కోర్టు..
అయితే ఈ ఒక్క విమానానికే కాదు రోమ్, మిలాన్, సియోల్ వంటి నగరాల నుంచి న్యూయార్క్ వచ్చిన విమానాలు అన్ని తిరుగు ప్రయాణం అయ్యాయి. కొన్ని అమెరికాలోని మిగతా ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ అయ్యాయి. జాన్ఎఫ్ కెన్నడీ విమానాశ్రంలో టెర్మినల్ 1 నుంచి బయలుదేరే, ల్యాండింగ్ అయ్యే విమానాలన్నీ ప్రభావితం అయ్యాయి. గతంలో దుబాయ్ నుంచి న్యూజిలాండ్ వెళ్లే ఓ విమానం కూడా 13 గంటల ప్రయాణించి, వరదల కారణంగా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో తిరిగి దుబాయ్ వెళ్లింది.
తాజాగా ఫ్లైట్ రాడార్ ప్రకారం.. ఎయిర్ న్యూజిలాండ్ బోయిగ్ 787 విమానం 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హవాయికి దక్షిణంగా ఫసిఫిక్ మహాసముద్రంపై యూటర్న్ తీసుకుని మళ్లీ ఆక్లాండ్ చేరుకుందని తెలిపింది. ఈ ఘటనపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి 16 గంటలు ప్రయాణించి ఉన్న చోటుకే చేరుకున్నామని కామెంట్ చేయగా.. మరోకరు ఓ రోజంతా ఎగురుతున్నట్లు ఊహించుకోండని, ట్రెడ్ మిల్ పై 16 గంటలు గడిపినట్లు ఉందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.