సాధారణంగా కిడ్నీలలో రాళ్లంటే చిన్నచిన్నవి ఉంటాయి. కానీ.. దాదాపు కిడ్నీ మొత్తం ఆవరించి, బయట కటివలయంలోకి కూడా వచ్చిన దుప్పికొమ్ము ఆకారంలోని రాయి ఉండడం చాలా తీవ్రమైన సమస్య. దాదాపు 80 మి.మీ. కంటే పొడవున్న ఈ రాయి ఇంచుమించు కిడ్నీ ఆకారంలోనే పెరగడంతో మూత్రనాళానికి అడ్డం పడదు, దాంతో నొప్పి తెలియదు, వాపు కూడా అంతగా ఉండదు. అందువల్ల రోగులకు ఇది ఉందనే విషయమే తెలియదు. ఇలాంటి తీవ్రమైన సమస్యను అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో తొలగించారు…
ఒక యువకుడి వృషణాల్లో అత్యంత అరుదైన, పెద్ద డంబెల్ ఆకారంలోని కణితిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజయవంతంగా తొలగించారు.