వైద్య రంగంలో విశేష సేవలు అందించినందుకు సంతోషంగా ఉందని, పద్మవిభూషణ్ అవార్డు తనలో బాధ్యతని ఇంకా పెంచిందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. పద్మవిభూషణ్ అవార్డు తనకు రాలేదని.. వైద్య రంగానికి, తన ఇన్‌స్టిట్యూషన్‌కు వచ్చిందని భావిస్తానన్నారు. ఏఐని వినియోగించి.. తక్కువ ఖర్చులతో వైద్యాన్ని క్షేత్ర స్థాయిలో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు వైద్య వృత్తిలో ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లేవారని, ఇపుడు ఇతర దేశాల నుంచి మన దగ్గరికి రీసెర్చ్…