కర్ణాటకలో విజయం అనంతరం దేశంలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశంలో బీజేపీని గద్దె దించేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటి నుంచి హామీల వర్షం కురిపించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.