మహబూబ్‌నగర్‌లో భూసేకరణ పేరిట వందల ఎకరాలను లాక్కుంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టును తప్పుదోవ పట్టించేలా.. భూములు తీసుకోవడం లేదని చెప్పి.. ఇప్పుడు మహబూబ్‌నగర్ హన్వాడలో రాత్రికి రాత్రి జేసీబీలు పంపి కంచెలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బడాబాబుల కోసం పేదల భూములు లాక్కుంటున్నారు. మహబూబ్ నగర్ లో మంత్రి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని…