ధరణి పోర్టల్‌పై ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంత మొత్తుకున్నా .. అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను భయపెట్టి, అక్రమ కేసులు పెట్టి భూమిని ఆక్రమించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను…
ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, గ్రామాల్లో తర తరాలుగా వ్యవసాయం చేసుకునే రైతుల హక్కులను ధరణితో భంగం కలిగిందని ఆయన మండిపడ్డారు.…