టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా వెంటనే మీడియాకు వివరిస్తారని ఫైర్ అయ్యారు.
అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తెలంగాణ పీసీసీకి కొత్త దిశానిర్దేశం చేయాలని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ నూతన ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే ను ఎయిర్ పోర్ట్ లోని లాంజ్ లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్ ఆహ్వానించారు.