యూఏఈలోని (UAE) అబుదాబిలో (Abu Dhabi) మంగళవారం జరిగిన ‘అహ్లాన్ మోడీ’ (Ahlan Modi) కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలోకి మోడీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రవేశించి అందరికీ అభివాదం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్నారు. దుబాయ్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఇక్కడ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమవుతారు. దీంతో పాటు అబుదాబిలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోడీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
BAPS Hindu Mandir: అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్(BAPS) ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది.