Solar Power : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించేందుకు వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకంలో భాగంగా, రాష్ట్రంలోని రైతులకు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లూ ఈ వివరాలను వెల్లడించారు.…