Agra: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.