అగ్నిపథ్ సమస్యగా ఎందుకు మారింది?సైన్యంకంటే ఆయుధాలే కీలకమని ప్రభుత్వం భావిస్తోందా?జీతాలు, పెన్షన్లు భారమనుకుంటోందా? సైన్యం కేవలం యుద్ధాల కోసమేనా?అగ్నిపథ్ అగ్గిరాజేసింది..ప్రభుత్వం యువతను సైన్యంలో భాగస్వాములను చేయటానికి అని చెప్తోంది.యువత మా ఉద్యోగాలను మాకివ్వాలని నినదిస్తోంది..ఇరుపక్షాల వాదనలు బలంగానే కనిపించినా, కనిపించే అంశాల వెనుక అసలు సంగతేమిటనేది కీలకంగా మారుతోంది. ఏ ఉద్యోగికైనా కొంత పని, దానికి ఆదాయం ఉంటుంది…ఆ పనికి ఉండే డిమాండ్‌ని బట్టి జీతం ఉంటుంది..ఇదే లెక్కలో చూస్తే సైన్యాన్ని కూడా ప్రభుత్వం చూస్తోందా?జనం ప్రాధాన్యత…
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘అగ్నిపథ్ స్కీమ్’పై స్పందించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న హింసపై విచారం వ్యక్తం చేశారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువతను రిక్రూట్ చేసుకోవడానికి మహీంద్రా గ్రూప్ అవకాశం కల్పిస్తుందన్నారు. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ స్వాగతం పలుకుతుందన్నారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఒక ట్వీట్‌లో “అగ్నిపథ్ పథకం నేపథ్యంలో జరిగిన హింసాత్మక సంఘటనలు చాలా బాధాకరమైనవి. గత సంవత్సరం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం వారిని ఉన్నతంగా…
సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. 1989 నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉందని డిపార్ట్మెంట్ మిలిటరీ ఎఫైర్స్ అడిషనల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్ పూరి వెల్లడించారు. ప్రతీ ఏడాది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 17,600 మంది రిటైర్ అవుతున్నారని ఆయన తెలిపారు. సైన్యంలో యువరక్తాన్ని నింపేందుకే అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చినట్లు తెలిపారు. సంస్కరణల్లో కొత్తదనంతో పాటు అనుభవాన్ని తీసుకురావాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.…