కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ, హర్యానా ప్రాంతాల్లో హింస చెలరేగింది. కేవలం నాలుగేళ్లకే సర్వీసును పరిమితం చేయడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకే వయోపరిమితి విధించడంతో వయస్సు దాటిపోయిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిన్న వయోపరిమితని మరో రెండేళ్లు పెంచగా.. తాజాగా శనివారం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. నిరుద్యోగుల ఆందోళనతో దిగి వచ్చిన…
దేశంలో ‘అగ్నిపథ్’ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కీమ్ పై ఆర్మీ ఆశావహుల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ప్రారంభం అయిన ఆగ్రహ జ్వాలలు మెల్లిగా దేశం మొత్తం పాకుతున్నాయి. ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం నాలుగేళ్ల కాలపరిమితితో ఈ అగ్నిపథ్ స్కీమ్ రావడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు, ఆగ్రహానికి గురవుతున్నారు. అగ్నిపథ్…
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. అంతే కాదు.. విధ్వంసాన్ని సృష్టించింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ విధ్వంసానికి కారణం రైల్వే పోలీసులే అంటున్నారు ఆందోళనకారులు.. పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా.. రైల్వే పట్టాలపైనే తిష్టవేసిన ఆందోళనకారులు.. నిరసన తెలిపేందుకు మేం రైల్వే స్టేషన్‌కు వచ్చాం.. ముందే ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. Read Also: Agnipath Scheme: న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా? శాంతియుతంగా నిరసన…
అగ్నిపథ్ ఆందోళనలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చేశాయి.. రైళ్లను తగలబెట్టడం, రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించడంతో.. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు పరుగులు పెట్టారు.. అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. Read Also: Secunderabad: ఆందోళనలకు ముందుగానే ప్లాన్ చేశారా? మరోవైపు, సికింద్రాబాద్ స్టేషన్‌లో అన్ని రైల్వే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.. ఇక, ఎంఎంటీఎస్ సర్వీసులనుకూడా నిలిపివేస్తున్నట్టు…
కేంద్ర ప్రభుత్వ “అగ్నిపథ్” పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి.. ఆ నిరసనలపై ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఆర్మీ శిక్షణ ప్రక్రియ ప్రత్యేకంగా,ఆలోచనాత్మకంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.. నిర్దిష్ట ప్రమాణాలు పొందుపర్చాం.. అవి నిరంతరం పర్యవేక్షించబడతాయి మరియు పరీక్షించబడతాయని స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా భారత్‌కు సమర్ధవంతమైన సైన్యాన్ని అందించగలమని అభిప్రాయపడ్డారు ఆర్మీ చీఫ్.. Read Also: Agnipath Protest: అగ్గి రాజేసిన అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి భారత…
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.. ఒక్కసారి ఎన్నికవగానే ప్రజా ప్రతినిధులు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారని… ప్రాణాలు అర్పించేందుకు సైన్యంలో దిగినవారికి పెన్షన్ స్కీమ్ ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీహార్‌లో మొదట అగ్నిపథ్‌పై ఆందోళను ప్రారంభం కాగా.. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. అయితే ఈ ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది అని మండిపడ్డారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని…
అగ్నిపథ్ స్కీంకు సంబంధించిన అంశంపై ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు, స్టాళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త ఘటనల కారణంగా కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు…