ఊహించని విపత్తులా వచ్చి పడిన తాలిబన్ల పాలనతో అఫ్ఘానిస్తాన్ కునారిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం సాయాన్ని నిలిపివేయడంతో ఆర్థికపరిస్థితి పూర్తిగా దిగజారింది.ఉపాధి లేక భార్యా పిల్లల కడుపు నింపేందుకు అఫ్గానీలు.. అవయవాలను అమ్ముకుంటున్నారు.ఇక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అధికారులు చెబుతున్నారు. తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేదరికంలోకి జారిపోయింది. ప్రజల్లో చాలా మందికి ఉపాధి కరువైంది. పనులు దొరక్కపోవడంతో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు అవయవాలను సైతం అమ్ముకునే దౌర్భాగ్యస్థితికి చేరారు ఆఫ్గనీలు. ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్ ప్రాంతానికి…