Pakistan: పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తాజాగా ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు.