కాబూల్‌లో ఆఫ్ఘన్ మహిళల ఆందోళనకు దిగారు. బ్యూటీ పార్లర్‌లను మూసివేయాలని తాలిబాన్ అధికారులు చేసిన ఆదేశానికి వ్యతిరేకంగా బుధవారం కాబూల్‌లో నిరసన వ్యక్తం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్‌పోజింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్…