అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా…
ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబాన్లు హస్తగతమైంది. అధ్యక్షపదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ, కీలక బృందంతో కలిసి దేశం వెళ్లిపోయారు. తన నిష్క్రమణపై అష్రఫ్ ఘనీ ట్వీట్ చేశారు. తాలిబాన్లతో జరిగిన పోరాటంలో ఇప్పటికే అనేక మంది చనిపోయారని గుర్తు చేశారు. మరింత రక్తపాతం జరగకుండా అధికారం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తుపాకులు, కత్తులతో ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లపై ప్రజల గౌరవం, శాంతిభద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు ఘనీ. అయితే, ఇలా అధికారంలోకి వచ్చిన పాలకులకు చట్టబద్దత…